నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద జారీచేసిన
నిర్దేశాల కాల పరిమితి పొడిగింపు
సికర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., సికర్, (రాజస్థాన్) – బ్యాంకింగ్
నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద జారీచేసిన
నిర్దేశాల కాల పరిమితి పొడిగింపు
తేది: 10/05/2019 సికర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., సికర్, (రాజస్థాన్) – బ్యాంకింగ్ అక్టోబర్ 26, 2018 తేదీన సికర్ ఆర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లి., సికర్, (రాజస్థాన్)కు జారీచేయబడిన నిర్దేశాలు, ప్రజా శ్రేయస్సుదృష్ట్యా, నవంబర్ 09, 2018 పని ముగింపువేలనుండి మరొక ఆరునెలలు పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించిందని ప్రజలకు తెలియచేస్తున్నాము. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సబ్-సెక్షన్ 1, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలుపరచిన అధికారాలతో, సికర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. సికర్ (రాజస్థాన్)కు అక్టోబర్ 26, 2018 న జారీచేయబడిన, నిర్దేశాల కాలపరిమితి, తమ ఆదేశం మే 02, 2019 ద్వారా, మరొక ఆరు నెలలు (అనగా మే 10, 2019 నుండి నవంబర్ 09, 2019 వరకు), పొడిగించినది. ఈ ఆదేశాలు సమీక్షించవచ్చు. పైన పేర్కొన్న నిర్దేశాల్లోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. రిజర్వ్ బ్యాంక్, పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. శైలజా సింగ్ పత్రికా ప్రకటన: 2018-2019/2647 |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: