కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి ఐ ఎస్ ఎఫ్-CISF) చే నిర్బంధించబడినది ఆర్బీఐ అధికారి కాదని భారతీయ రిజర్వు బ్యాంకు చే స్పష్టికరణ
January 20, 2018 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి ఐ ఎస్ ఎఫ్-CISF) చే నిర్బంధించబడినది ఆర్బీఐ అధికారి ఒక ఆర్బిఐ అధికారి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) చేత పట్టుకోబడ్డాడని, ఆర్బిఐ పరిధి లోని దేవాస్ ముద్రణా కేంద్రంలో ముద్రించిన నగదును దొంగిలించాడని, మీడియా యొక్క ఒక విభాగంలో నివేదించబడింది. బ్యాంక్ నోట్ ప్రెస్ (బి ఎన్ పి), దేవాస్, సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మైనింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క యూనిట్. ఇది భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణలో లేదు. అంతేకాకుండా, బి ఎన్ పి, దేవాస్ లో ఏ ఆర్బీఐ అధికారీ పనిచేయుట లేదు. అందువల్ల మీడియా నివేదికలు వాస్తవాలపై ఆధారపడినవి కావు. నివేదికలను ప్రచురించడానికి ముందు, వార్తా సంస్థలు వాస్తవాలను ధృవీకరించుకోలేదని, ఆర్బిఐ విచారం వ్యక్తం చేసింది. జోస్ జె కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/1991 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: