RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78489859
ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకై ఏప్రిల్ 1, 2017 తేదీన అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు తెరిచి ఉంచుట - సవరించిన ఆదేశాలు

ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకై ఏప్రిల్ 1, 2017 తేదీన అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు తెరిచి ఉంచుట - సవరించిన ఆదేశాలు

RBI/2016-17/259
DBR.No.Leg.BC.56/09.07.005/2016-17

మార్చ్ 29, 2017

అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు

అయ్యా/అమ్మా,

ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకై ఏప్రిల్ 1, 2017 తేదీన అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు తెరిచి ఉంచుట - సవరించిన ఆదేశాలు

మా సర్క్యులర్ DBR.No.Leg.BC.55/09.07.005/2016-17 తేదీ మార్చ్ 24, 2017 ద్వారా అన్ని ప్రాతినిధ్య బ్యాంకులను, ప్రభుత్వ లావాదేవీలు జరిపే వారి శాఖలన్నింటినీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రోజులూ మరియు ఏప్రిల్ 1, 2017 (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని శెలవు దినాలతో సహా) తేదీన తెరిచి ఉంచాలని ఆదేశించడం జరిగింది.

2. ఈ సందర్భంగా, ఏప్రిల్ 1, 2017 తేదీన బ్యాంక్ శాఖలు తెరిచి ఉంచడం వల్ల వార్షిక ముగింపు (annual closing) కార్యకలాపాలకు - ప్రత్యేకించి ఆ తేదీనుండి కొన్ని బ్యాంకుల విలీనీకరణ దృష్ట్యా - అంతరాయం కలుగవచ్చని నివేదనలు అందినవి. అందువల్ల, ప్రభుత్వంతో చర్చించిన తరువాత, ప్రభుత్వ లావాదేవీలు జరుపుతున్న ప్రాతినిధ్య బ్యాంకుల శాఖలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని శెలవు దినాలతో సహా), ఇంతకు ముందే సూచించినట్లు తెరిచి ఉంచాలనీ, అయితే, ఈ శాఖలు ఏప్రిల్ 1, 2017 తేదీన తెరిచి ఉంచవలసిన అవసరం లేదని, నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మీ విధేయులు,

(రాజిందర్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?