RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522231
తెలంగాణా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత

తెలంగాణా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత

ఆర్.బి.ఐ/2018-19/218
యఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నం.19/02.08.001/2018-19.

జూన్ 20, 2019

ది చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
అన్ని లీడ్ బ్యాంకులు.

మేడమ్/డియర్ సర్,

తెలంగాణా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత

తెలంగాణా ప్రభుత్వం, ఫిబ్రవరి 16, 2019 వ తేదీ నాటి తమ గెజిట్ నోటిఫికేషన్ జి.ఓ.యం.యస్. నం.18 మరియు 19 ల ద్వారా రెండు క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 29, 2018 వ తేదీ నాటి తమ గెజిట్ నోటిఫికేషన్ నం. యఫ్-1-9-2018-VII-6 ద్వారా వొక జిల్లా ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది:

క్రమ సంఖ్య రాష్ట్రం క్రొత్తగా మలిచిన జిల్లా ఇదివరకటి జిల్లా క్రొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల పరిధిలోని రెవెన్యూ డివిజన్/తహసిల్ లు బాధ్యతలు అప్పగించబడిన లీడ్ బ్యాంకు క్రొత్త జిల్లాకు కేటాయించిన ‘డిస్ట్రిక్ట్ వర్కింగ్ కోడ్’
1. తెలంగాణా ములుగు జయశంకర్ భూపాలపల్లి ములుగు రెవెన్యూ డివిజన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 00A
2. తెలంగాణా నారాయణ్పేట్ మహబూబ్ నగర్ నారాయణ్పేట్ రెవెన్యూ డివిజన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 00B
3. మధ్యప్రదేశ్ నివారి తికంఘర్ ప్రిత్విపూర్, నివారి మరియు ఓర్ఛ తహసిల్ లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 00C

2. ఇంకా, క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకుల బియస్ఆర్(BSR) నివేదికల కొరకై కేటాయించబడ్డాయి.

3. తెలంగాణా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఇదివరకటి జిల్లాలు మరియు ఇతర జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలలో ఏ మార్పు లేదు.

మీ విధేయులు

గౌతమ్ ప్రసాద్ బోరా
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?