RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78526322
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద ఆదేశాలు - రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద ఆదేశాలు - రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

తేదీ: ఫిబ్రవరి 26, 2021

సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ
చట్టం 1949 క్రింద ఆదేశాలు - రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,
పుణే, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు, ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13 ద్వారా రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రను, ఫిబ్రవరి 22, 2013 తేదీ పనివేళల ముగింపు నుండి క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి ఫిబ్రవరి 28, 2021 వరకు పొడిగించబడింది.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన ఆదేశాలు మే 31, 2021 తేదీవరకు, ఫిబ్రవరి 24, 2021 నాటి తమ ఆదేశం DOR.RTG.MON/D-58/12.22.218/2020-21 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది.

3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఫిబ్రవరి 24, 2021 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/1157

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?