జారీచేసిన నిర్దేశాల పొడిగింపు
శివమ్ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్రకు
జారీచేసిన నిర్దేశాల పొడిగింపు
తేది: 20/05/2019 శివమ్ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్రకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మే 18, 2018 తేదీన జారీచేసిన ఆదేశాల ద్వారా, శివమ్ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర, మే 19, 2018 పనివేళల ముగింపు సమయంనుండి నిర్దేశాల పరిధిలోనికి తేబడినది. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1) (సెక్షన్ 56 తో కలిపి) ద్వారా వారికి దఖలుపరచబడిన అధికారాలతో, పైన పేర్కొన్న నిర్దేశాలు మరొక మూడు నెలలపాటు, అనగా ఆగస్ట్ 19, 2019 వరకు కొనసాగవలెనని, మే 13, 2019 తేదీన ఆదేశాలు జారీచేసినదని ఇందుమూలముగా ప్రజలకు తెలియజేయడమైనది. కాల పరిమితి పొడిగిస్తూ జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకొరకు, శివమ్ సహకారి బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శింపబడినది. రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన పొడిగింపు /లేదా మార్పు చేసినందువల్ల, బ్యాంకుయొక్క ఆర్థికస్థితిగురించి రిజర్వ్ బ్యాంక్ సంతృప్తిచెందినదని భావించరాదు. ఎన్. షన్ముగరామ్ పత్రికా ప్రకటన: 2018-2019/2718 |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: