ప్రాధాన్యతా రంగాలకు రుణాలు- సవరించిన రిపోర్టింగ్ వ్యవస్థ
RBI/2016-17/79 అక్టోబర్ 06, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/ డియర్ మేడమ్/సర్, ప్రాధాన్యతా రంగాలకు రుణాలు- సవరించిన రిపోర్టింగ్ వ్యవస్థ ఏప్రిల్ 23, 2015న జారీ చేసిన సర్క్యులర్ నెం. FIDD.CO.Plan.BC.54/04.09.01/ 2014-15 ప్రకారం ప్రాధాన్యతా రంగ మార్గదర్శకాలను సవరించడం జరిగింది. తదనుగుణంగా ప్రాధాన్యతా రంగాలకు రుణాలపై సమర్పించాల్సిన త్రైమాసిక మరియు వార్షిక పర్యవేక్షక నివేదికల ఫార్మాట్ లను జూన్ 11, 2015న జారీ చేసిన సర్క్యులర్ నెం. FIDD.CO.Plan.BC.No.58/04.09.001/2014-15 ద్వారా విడుదల చేయడం జరిగింది. 2. సమీక్ష అనంతరం, ప్రాధాన్యతా రంగాలకు రుణాలపై త్రైమాసిక మరియు వార్షిక పర్యవేక్షక నివేదికల ఫార్మాట్ లను సవరించాలని నిర్ణయించడమైనది. అందువల్ల బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చిన అడ్వాన్స్ లకు సంబంధించిన సమాచారాన్ని, మేము జతపరిచిన, సవరించిన ఫార్మాట్ లో అందజేయాలని బ్యాంకులను ఆదేశించడమైనది. సవరించిన త్రైమాసిక మరియు వార్షిక నివేదికలను ప్రతి త్రైమాసిక, ఆర్థిక సంవత్సరం ముగిసిన పదిహేను మరియు నెల రోజులలోగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సమీకృత మరియు అభివృద్ధి శాఖ, గణాంకాల విభాగం, సెంట్రల్ ఆఫీస్, మూడవ అంతస్తు, అమర్ బిల్డింగ్, ఫోర్ట్, ముంబై- 400001 అన్న చిరునామాకు పంపాలి. 3. అంతే కాకుండా, జూన్, 2016 మరియు సెప్టెంబర్, 2016తో ముగిసిన త్రైమాసాల రిటర్న్ లను అక్టోబర్ 21, 2016లోగా సవరించిన ఫార్మాట్లలో మాత్రమే దాఖలు చేయాలని బ్యాంకులను ఆదేశించడమైనది. మీ విశ్వసనీయులు, (ఎ.ఉద్గత) Encl: పైన పేర్కొన్నవి |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: