RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508363
అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత

అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత

ఆర్.బి.ఐ/2017-18/122
ఎఫ్.ఐ.డి.డి. సీఓ. ఎల్.బి.యస్./బీసీ.నం/2195/02.08.001/2017-18.

జనవరి 18, 2018

చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు
అన్ని లీడ్ బ్యాంకులు.

డియర్ సర్/మేడమ్,

అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత

అస్సాం ప్రభుత్వం, జనవరి 25, 2016, ఫిబ్రవరి 26, 2016 మరియు ఆగష్టు 5, 2016 తేదీలనాడు తమ గెజిట్ నోటిఫికేషన్ ల ద్వారా ఎనిమిది క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది.

క్రమ సంఖ్య క్రొత్తగా మలిచిన జిల్లా ఇదివరకటి జిల్లా క్రొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల పరిధిలోని ఫిర్కాలు (సబ్ డివిజన్లు) బాధ్యతలు అప్పగించబడిన లీడ్ బ్యాంకు క్రొత్త జిల్లాకు కేటాయించిన ‘డిస్ట్రిక్ట్ వర్కింగ్ కోడ్’
1. నగావ్ నగావ్ కలియాబోర్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 014
2. హోజాయ్ నగావ్ హోజాయ్ సివిల్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 409
3. శివసాగర్ శివసాగర్ నజీరా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 012
4. చరాయ్ దేవ్ శివసాగర్ చరాయ్ దేవ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 405
5. జోర్హాట్ జోర్హాట్ తితాబోర్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 011
6. మాజులీ జోర్హాట్ మాజులీ సివిల్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 408
7. ధుబ్ రీ ధుబ్ రీ బిలాసిపారా యూకో బ్యాంక్ 019
8. దక్షిణ సాల్ మారా-మాన్ కాచార్ ధుబ్ రీ ఫకీర్గంజ్ జిల్లా పరిషద్ నియోజక వర్గం, బిరాసింగ్ జార్వా బ్లాకు, మరియు జమాదార్హట్ డెవలప్మెంట్ బ్లాకు తప్ప, మిగతా దక్షిణ సాల్ మారా సబ్ డివిజన్. యూకో బ్యాంక్ 406
9. సోనిత్పుర్ సోనిత్పుర్ తేజపూర్, ధేకియాజులీ యూకో బ్యాంక్ 006
10. బిశ్వనాద్ సోనిత్పుర్ గహపూర్ సివిల్, బిశ్వనాద్ సివిల్ మరియు చటియా మరియు నోద్వార్ రెవెన్యూ మండలం లోని నాగ్సంకర్ మౌజాలు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 407
11. కార్బీ ఆంగ్ లోంగ్ కార్బీ ఆంగ్ లోంగ్ బోకాజన్ భారతీయ స్టేట్ బ్యాంక్ 016
12. పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ కార్బీ ఆంగ్ లోంగ్ హంరెన్ సివిల్ భారతీయ స్టేట్ బ్యాంక్ 404

2. ఫిబ్రవరి 26, 2016 తేదీ గెజెట్ నోటిఫికేషన్ లో “తూర్పు కామరూప్” మరియు “దక్షిణ కామరూప్” పేర్లతో రెండు క్రొత్త జిల్లాలు ప్రకటించినప్పటికీ, అస్సాం ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలు ఇంకా క్రియాశీలం కాలేదు. అందుచేత, ఈ జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యత వేరుగా అప్పగించబడుతుంది.

3. క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకుల BSR నివేదికల కొరకై ఈయబదినవి.

4. అస్సాం రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతలలో ఏ మార్పు లేదు.

మీ విధేయులు

(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?