RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78471354
సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16

సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16

నవంబర్ 24, 2015

సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16

భారత ప్రభుత్వంతో సంప్రదించి, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్, వారి సర్క్యులర్లు, IDMD.CDD.No.939/14.04.050/2015-16 తేదీ అక్టోబర్ 30, 2015, IDMD.CDD.No.968/14.04.050/2015-16 తేదీ నవంబర్ 4, 2015, ద్వారా సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-2016, జారీ వివరాలు ప్రకటించింది. మొదటి విడత బాండ్లు, పెట్టుబడికై నవంబర్ 5, 2015 నుండి నవంబర్ 20, 2015 వరకు తెరిచి ఉంచబడ్డాయి. బాండ్లు, నవంబర్ 26 న జారీ చేయబడవలసి ఉంది.

బ్యాంకులు, తపాలా కార్యాలయాలచే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. దరఖాస్తుల వివరాలు, రిజర్వ్‌ బ్యాంక్ E-kuber సిస్టమ్‌ లో సులభంగా 'అప్‌లోడ్' చేయడానికి వీలుగా (ప్రత్యేకించి, తపాలా కార్యాలయాలు), బాండ్ల జారీ తేదీ, నవంబర్ 26, 2015 బదులుగా నవంబర్ 30, 2015 కు మార్చబడింది.

పై సర్క్యులర్ల లోని ఇతర నియమ నిబంధనలలో ఏ మార్పూ లేదు.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2015-2016/1236

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?